కంగనా రనౌత్‌ ఎమర్జన్సీ.. చెత్తగా తీశారన్న ప్రముఖ కన్నడ నటి

Published on Fri, 03/07/2025 - 19:25

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో కంగనా నటించిన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' పోలుస్తూ మాట్లాడారు. ఎమర్జన్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు వచ్చినప్పటికీ.. ఆ సినిమా నిర్మించిన తీరు బాగాలేదని ఆమె అన్నారు. కంగనా విషయానికొస్తే ఆమె అద్భుతమైన నటి అని కొనియాడింది. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా రమ్య కామెంట్స్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో కంగనా  భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.

రమ్య మాట్లాడుతూ.. "ఎమర్జెన్సీ చిత్రం చెత్తగా  నిర్మించారు. కంగనా రనౌత్ చాలా ప్రతిభావంతురాలైన నటి. ఆ సినిమాతో కంగనాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ సినిమా చెడుగా తీయడం వల్లే ప్రేక్షకులు తిరస్కరించారు. గతంలో కంగనా మణికర్ణికను కూడా నిర్మించింది ఆ మూవీ కంటెంట్ బాగుంది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు  ఇష్టపడ్డారు. అందుకే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.' అని తెలిపింది. కాగా.. కంగనా రనౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఎమర్జన్సీ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)