Breaking News

రజనీకాంత్‌పై 'రంభ' వైరల్‌ కామెంట్లు.. సోషల్‌మీడియాలో వివాదం!

Published on Thu, 01/04/2024 - 16:32

రంభ 90వ దశకంలో తమిళ,తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా కొనసాగింది. రజనీకాంత్‌, కమల్ హాసన్‌, అజిత్, విజయ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరితోనూ ఆమె నటించింది.  ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నటి రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రంభ షూటింగ్ స్పాట్‌లో నటుడు రజనీకాంత్‌తో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది., నటుడు రజనీకాంత్ చిలిపి పనులలో మునిగిపోతారని రంభ చెప్పిన మాటలను కట్ చేసి రజనీకాంత్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోను కొందరు  ట్రెండ్‌ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

1997లో సుందర్ సి దర్శకత్వంలో అరుణాచలం చిత్రంలో రజనీ, సౌందర్య, రంభ నటించారు.  ఈ సినిమాలో రంభ కీలక పాత్ర పోషించింది. అందులో రజనీకాంత్‌కు అసిస్టెంట్‌గా ఆమె మెప్పించింది. ఆ సినిమా సెట్‌లో జరిగిన సంఘటన గురించి ఆమె ఇలా తెలిపింది.  'అరుణాచలం సినిమాతో పాటు నేను ఆ సమయంలో  సల్మాన్‌ ఖాన్‌తో బంధన్‌ చిత్రం కూడా ఒప్పుకున్నాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్‌ షూటింగ్‌ చేశాను.

ఆ సమయంలో రజనీకాంత్‌ను  కలిసేందుకు హిందీ నటుడు సల్మాన్ ఖాన్ వచ్చాడు.. అప్పుడు నేను ఆయన్ను చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను.. ఆ సమయంలో  రజనీ దూరంగా కూర్చొని  మమ్మల్ని చూస్తున్నాడు.. ఆ తర్వాత రజనీ షూటింగ్ ఆపి దర్శకుడు సుందర్ సితో మాట్లాడుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయ్యింది.  సెట్‌లో గందరగోళం.. నెలకొంది. రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ  అర్థం కావడం లేదు.  

ఆ సమయంలో అక్కడే ఉన్న  కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటి మేడమ్..? ఇలా చేశారు, ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే ఏడ్చేశాను .  అప్పుడు నేను ఏడుస్తున్నట్లు  రజనీ సార్ గమనించి  భయపడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆమెను ఎందుకు ఏడిపించారని అక్కడున్న వారందరిపై మండిపడ్డారు.  నేనేం తప్పు చేశాను సార్‌.. ఏం  జరిగింది..? అని నేను  అడిగాను. అప్పడు  వెంటనే షూటింగ్ స్పాట్‌లో ఉన్న వారందరినీ రజనీ అక్కడికి పిలిచారు.  

ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి కౌగిలించుకుంది.. ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా అలా హగ్‌ చేసుకుందా అంటూ దానిని ఆయన  ప్రాక్టికల్‌గా చేసి చూపించారు.  అదే మా సినిమా సెట్‌లో అయితే..  గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోతుంది. తన బాలీవుడ్‌ సినిమా హీరో అయితే కౌంగిలించుకుని మరీ విష్‌ చేస్తుంది అంటూ అందరి రజనీకాంత్‌ సరదాగా నన్ను ఆటపట్టించారు. నన్ను ఇలా ఆట పట్టించాలని వారు ముందే ప్లాన్‌ చేసుకున్నారని తర్వాత అర్థం అయింది.  అదేం నాకు తెలియకపోవడంతో చాలా సమయం పాటు నేను ఏడ్చాను. అలా సరదాగా రజనీ సార్‌ నన్ను ఏడిపించారు.' అని ఆనాటి విషయాలను రంభ గుర్తు చేసుకుంది.

ఏదేమైనా రజనీ సర్‌ని ఎప్పుడూ అలా చూడలేదని రంభ చెప్పింది.  ఇది ఉత్తర భారత సంస్కృతి అని ఆయనతో చెప్పాను. వెంటనే తను రేపటి నుంచి యూనిట్‌లో అందరూ వరుసలో నిలుచోవాలని కోరారు. రేపటి నుంచి రంభ వచ్చి అందరినీ కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ చెపుతుందని మరోసారి రజనీ సార్‌ ఆటపట్టించారని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొందరు సోషల్‌ మీడియాలు రంభ వ్యాఖ్యలను కొంత వరకు మాత్రమే కట్‌ చేసి రజనీ కాంత్‌ పట్ల నెగటివ్‌ను వ్యాప్తి చేయడం గమనార్హం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)