Breaking News

అర్జున్‌ రెడ్డి ఆఫర్‌ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్‌

Published on Wed, 01/11/2023 - 11:44

తమిళసినిమా: సంచలన నటిగా ముద్ర వేసుకున్న పార్వతి నాయర్‌ బహుభాష నటిగా రాణిస్తున్నారు. తమిళంలో ఉత్తమ విలన్, మాలై నేరత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్‌ తదితర చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని చెప్పింది. అయితే అది జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని, వెంటనే దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. తాను మాత్రం దానిని మిస్‌ చేసుకున్నానని చెప్పింది. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డిలో కథానాయకిగా తాను నటించాల్సి ఉందని, అయితే అందులో లిప్‌లాక్‌ సన్నివేశాలు, రొమాన్స్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో తాను నిరాకరించినట్లు పేర్కొంది.

చదవండి: ఈ గల్లీబాయ్‌ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించింది: రాహుల్‌ ఎమోషనల్‌

నిజానికి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని చిత్రం చూసిన తరువాత చాలా బాధపడ్డానని చెప్పింది. వాస్తవానికి అర్జున్‌రెడ్డి ఒక అందమైన చిత్రమని తెలిపింది. ఆ చిత్రాన్ని నిరాకరించి పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే జీవితంలో తనకు కలిగిన మరో అద్భుత అవకాశం ఉత్తమవిలన్‌ కమలహాసన్‌తో కలిసి నటించానని పేర్కొంది. ఆ అనుభవాన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని చెప్పింది. కమలహాసన్‌ సరసన నటించాను అన్న విషయాన్ని ఇప్పుడు తలచుకున్నా నమ్మసక్యంగా లేదని చెప్పింది. కాగా ఒకే తరహా కథా పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం తనకు ఇష్టం ఉండదని పార్వతి నాయర్‌ పేర్కొంది. 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)