Breaking News

సైబర్‌ వలలో చిక్కుకున్న నటి నగ్మా.. ఒక్క క్లిక్‌తో రూ.లక్ష మాయం!

Published on Thu, 03/09/2023 - 11:20

ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు.  సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా సినియర్‌ హీరోయిన్‌ నగ్మా కేటుగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో మోసపోయారు. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ని క్లిక్‌  చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు.

ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్‌కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఓ మెసేజ్‌ వచ్చిందట. అందులో ఉన్న ఓ లింక్‌ని ఓపెన్‌ చేయగానే వెంటనే ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందట. బ్యాంక్‌ ఎంప్లాయ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న కేటుగాడు.. కేవైసీ అప్‌డేట్‌ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ.. తన్‌ ఆన్‌లైన్‌ బ్యాంకులోకి లాగిన్‌ అయి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట.

నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్‌కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా  ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై     సైబర్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)