Breaking News

మూడుసార్లు మిస్‌క్యారేజ్‌, కెరీర్‌కు నటి గుడ్‌బై.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్‌

Published on Sun, 03/16/2025 - 17:20

బుల్లితెర నటి, తెలుగమ్మాయి గౌరీ నాయుడు (Actress Gowri Naidu) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. 2018లో రాజశేఖరన్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. పలుమార్లు ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినప్పటికీ ఆ గర్భం నిలవకుండానే పోయింది. దీంతో ఎంతో బాధపడ్డ ఆమెకు ఈసారి బిడ్డ పుట్టడంతో సంతోషంలో మునిగి తేలుతోంది.

ఉత్తమ విలన్‌గా అవార్డు
ఆడదే ఆధారం, మనసు-మమత, ప్రేమ ఎంత మధురం, మల్లి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఉత్తమ విలన్‌గా అవార్డు కూడా అందుకుంది. కానీ కొంతకాలంగా గౌరీ బుల్లితెరకు దూరంగా ఉంటోంది. నిజానికి సీరియల్స్‌తోనే ఆగిపోకుండా సినిమాలు కూడా చేయాలన్నది ఆమె కోరిక. కానీ సీరియల్స్‌లో నటించే సమయంలో వరుసగా మూడుసార్లు గర్భస్రావం అయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది.

ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గరే..
దానికి తోడు ఎంతమంది పిల్లలు? అన్న జనాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. చివరకు విసుగొచ్చి నాకు ముగ్గురు పిల్లలు.. కానీ ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారంటూ అప్పట్లో ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసింది. వరుస అబార్షన్ల వల్ల తనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో ఆమె కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చింది. అప్పటినుంచి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో తరచూ షేర్‌ చేస్తూ వస్తోంది. సీమంతం ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఇప్పుడు బేబీ జన్మించింది. మరి పాపను ఎప్పుడు చూపిస్తుందో చూడాలి!

 

 

 

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి'

#

Tags : 1

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)