Breaking News

కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!

Published on Wed, 07/26/2023 - 18:54

కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్‌ సౌత్‌ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్‌ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్‌ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్‌లో కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. 

(ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!)

ఆమె ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్‌ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్‌లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

ఇన్‌స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని  పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. 

అసలు అరవింద్ ఎవరు?

తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్‌ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు.

యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు.  ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్‌ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. 

(ఇది చదవండి: ఆ సీక్రెట్‌ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్‌ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! )

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)