Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్
Published on Fri, 01/23/2026 - 19:51
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.
లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్‌ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు.
Every pause had a purpose. 🎬 #Lockdown in cinemas Jan 30. 🗓️#LockdownInCinemasJan30@anupamahere #ARJeeva @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #PriyaaaVenkat @shakthi_dop @NRRaghunanthan @sidvipin @EditorSabu @sherif_choreo #SriGirish #OmSivaprakash… pic.twitter.com/hqNtUX8qxl
— Lyca Productions (@LycaProductions) January 23, 2026
Tags : 1