Breaking News

హీరోయిన్‌ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్‌: ఆనంది

Published on Thu, 08/31/2023 - 09:56

తమిళసినిమా: తనకు నటనపై ఆసక్తే లేదని నటి కయల్‌ ఆనంది పేర్కొన్నారు. ఈమె అసలు పేరు ఆనంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో కయల్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి ఆదరణ పొందడంతో కయల్‌ ఆనందిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత పరియేరుమ్‌ పెరుమాళ్‌, చండీవీరన్‌, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్‌ వగైయార్‌, ఎన్‌ ఆలోడ చెరుప్పు కానోమ్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు. గ్లామర్‌కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటారు.

కాగా ఆమె ఇటీవల తన సినీ అనుభాలను ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు మొదట్లో నటనపై ఆసక్తే లేదని చెప్పారు. అసలు నటినవుతానని కూడా ఊహించలేదన్నారు. అయితే కయల్‌ చిత్రం తరువాత నటనపై ఆసక్తి కలిగిందన్నారు.

ఇప్పుడు మంచి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. అదే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు. తనకు నప్పే పాత్రలకు దర్శక నిర్మాతలు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తాను నటిగా చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానని తెలిపారు. కయల్‌ చిత్రంలో నటించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఆ చిత్రం తన కేరీర్‌కు బాగా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)