Breaking News

నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక

Published on Wed, 09/23/2026 - 07:28

ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన అక్కాచెల్లెళ్లు రాధ-అంబిక ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తన గదిలో ఖాళీ చెక్కులు దొంగిలించి, దాదాపు రూ.50 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారని నటి రాధ.. తన అక్క అంబిక, సోదరుడు మల్లిఖార్జున్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ విషయంపై అంబిక స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో మోసపోయింది తానేనని తీవ్ర ఉద్వేగానికి లోనయింది. కమిషనరేట్‌లో రాధ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించారు.

నిజానికి మోసపోయింది నేనే. నేనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. రాధకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. ఆమె ఎవరి ప్రభావంతో ఇలా చేసిందో నాకు తెలీదు కానీ ఆమెని చూస్తే జాలేస్తోంది. మేం కష్టపడి సంపాదించిన డబ్బులో సగం అమ్మకు ఇచ్చాం. ఏఆర్ఎస్ అనేది అంబికా దేవర్ ఫిలిమ్స్ కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి, అది మేం కొన్న మొదటి ఆస్తి. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేను అండగా నిలిచాను. దీని వెనక చాలా చరిత్ర ఉంది. ఈ వివాదానికి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నందున అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేను అని అంబిక చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు కుటుంబం కోసం అందరం కలిసికట్టుగా ఆలోచించేవాళ్లమని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోందని, సినిమా పరిశ్రమలో ఈ రోజు డబ్బు మాత్రమే ప్రధానమైపోయిందని ఎమోషనల్ అయ్యారు.

#

Tags : 1

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)