Breaking News

స్వగ్రామంలో విజయ్‌.. ఎమోషనల్‌ ఫోటో షేర్‌ చేసిన మేనమామ

Published on Thu, 03/05/2026 - 16:34

లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్‌ జోడీ తమ వివాహాన్ని  కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన  విజయ్‌ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు.  మార్చి 1న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు కొన్ని ఆలయాల్లో అన్నదానం చేసిన ఈ జంట చాలామంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు. ఆపై హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చింది.

వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి విజయ్‌ తిరిగొచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్‌రావుల మొదటి సంతానం విజయ్‌ దేవరకొండ అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అక్కడ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుని తమ గ్రామప్రజలకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

సత్యనారాయణ వ్రతం తర్వాత విజయ్‌ తన గ్రాండ్‌ పేరంట్స్‌(నానమ్మ-తాతయ్య) సమాధుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను విజయ్‌కి మేనమామ, స్నేహితుడు, నిర్మాత యష్ రంగినేని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.  "ప్రపంచం ఆడంబరాన్ని చూస్తుంది. నేను వినయాన్ని చూస్తున్నాను . ఎంత ఎత్తుకు ఎదిగినా సరే తన మూలాలను మరిచిపోలేదు. అతను సాధించిన విజయాల చప్పట్లకు అతీతంగా.. అతను గొప్ప విలువలతో పాతుకుపోయాడు. తల వంచి తన పూర్వీకుల ఆశీర్వాదం కోరుకోవడానికి మా గ్రామానికి తిరిగి వచ్చాడు." అని యష్‌ రంగినేని రాసుకొచ్చారు.

యశ్ రంగినేని ఎవరో తెలుసా..
యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.  బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)