Breaking News

ఆ సీన్‌లో నటించింది నేను కాదు... విజయ్‌ ఆంటోని

Published on Tue, 08/06/2024 - 13:28

నటుడు విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మలై పిడిక్కాద మనిదన్‌. ఇన్ఫినిటీ ఫిలిం వేంచర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహించారు. నటుడు శరత్‌కుమార్, సత్యరాజ్, నటి మేఘాఆకాశ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. 

కాగా ఈ చిత్రంలోని ఆరంభంలో వచ్చే ఒక నిమిషం సన్నివేశాలను తనకు తెలియకుండా కలిపారని దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ ఆరోపించడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయమై ఆయన మీడియాను కలవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తరువాత మీడియాను కలవాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్రంలో కథానాయకుడు ఏం చేస్తాడు, అతను రౌడీనా? పోలీసా? అతనికి వర్షం అంటే ఎందుకు నచ్చదు? వంటి విషయాలను సస్పెన్స్‌గా ఉంచానన్నారు. 

అయితే ఆ సన్నివేశాలను చిత్రంలో ముందుగానే రివీల్‌ చేసేలా తనకు తెలియకుండా చేర్చారని దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ ఆరోపించడంతో నటుడు శరత్‌కుమార్‌ ఈ వివాదంలో జోక్యం చేసుకుని దర్శకుడికి, నిర్మాతకు మధ్య సమన్వయం కుదిర్చినట్లు సమాచారం. ఈ వివాదం గురించి ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ ఆంటోని పేర్కొంటూ మలై పిడిక్కాద మనిదన్‌ చిత్రంలో నిమిషం పాటు సాగే సన్నివేశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సన్నివేశాల్లో నటించింది తాను కాదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగినా? అనే చర్చ సాగుతోంది. 
 

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?