ఉన్ని ముకుందన్‌పై ఆరోపణలు.. అసలు విషయం బయటపెట్టిన హీరో!

Published on Wed, 05/28/2025 - 16:20

మార్కోతో మోస్ట్ వయొలెన్స్‌ను అభిమానులకు పరిచయం చేసిన హీరో ఉన్ని ముకుందన్. గతేడాది థియేటర్లలో విడుదలైన మార్కో మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో విపరీతమైన వయోలెన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైంది. కొత్త ఏడాదిలో గెట్ సెట్ బేబీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో జనతా గ్యారేజ్‌, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులోనూ ఉన్ని ముకుందన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే తాజాగా ఉన్ని ముకుందన్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు.  ఆయనపై మాజీ మేనేజర్ విపిన్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాలా కాలంగా ఉన్ని ముకుందన్‌ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. తనపై నటుడు ఉన్ని ముకుందన్‌ దాడి చేయించారని విపిన్‌ కుమార్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అన్నీ అవాస్తవాలే..

తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్ని ముకుందన్‌ స్పందించారు. అతను చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని అన్నారు. అతనిపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు దాడి చేసినట్లు చెబుతున్న విపిన్ కుమార్‌ను తన మేనేజర్‌గా కూడా నియమించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను దాడి చేయించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.

ఉన్ని ముకుందన్ తన పోస్ట్‌లో రాస్తూ.. "2018లో నా సొంత నిర్మాణంలో నా మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నప్పుడు విపిన్ కుమార్ నన్ను సంప్రదించాడు. ఆయనను నా వ్యక్తిగత మేనేజర్‌గా ఎప్పుడూ నియమించలేదు. అతను చెప్పినట్లుగా ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అవాస్తవం. మేమున్న ప్రదేశమంతా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని' రాసుకొచ్చారు.

అతని పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల మద్దతు ఉందని చెబుతున్నారు.. నా డేటా అంతా అతని వద్ద ఉండటంతో.. నేను ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని అభ్యర్థించానని ఉన్ని ముకుందన్ తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కానీ నాపై న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు.  

u

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)