Breaking News

ప్రాణాలు కాపాడే వైద్యులకు మనమే రక్షణగా ఉండాలి: సుమన్‌

Published on Sat, 08/17/2024 - 21:11

పశ్చిమబెంగాల్‌  కోల్‌కతాలో ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన యావత్‌ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు అందరూ రోడ్డెక్కారు. వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు తమ నిరసనగా భారత వైద్య సంఘం(ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ ఘటనను ఖండిస్తూ ఇప్పటికే ఎందరో ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చిన సినీ హీరో సుమన్‌ అక్క‌డ  వైద్యుల నిరస‌న‌ను చూసి స్పందించారు.

'మన సమాజంలో వైద్యులు చాలా ప‌విత్ర‌మైన వృత్తిలో కొనసాగుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు తర్వాత ఆ స్థానంలో వైద్యులు ఉన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా మన దగ్గరకు రాలేదు. అలాంటిది వైద్యులు మనకు రక్షణగా నిలిచి కాపాడారు. కులం, మతం అని చూడకుండా డాక్టర్లు సేవ చేస్తున్నారు.  ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అయినా సరే సేవ చేసేందుకు ముందుకు వ‌స్తారు. 

క‌రోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను వారు కాపాడారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎందరో డాక్ట‌ర్‌లు, న‌ర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మ‌న‌మే కాపాడుకోవాలి. వారికి కొంత మంది మాత్రమే స‌పోర్టు చేయ‌డం బాధాక‌రం. రాజకీయాలకు అతీతంగా మ‌హిళ‌లకు ర‌క్ష‌ణగా ఉండాలి. మహిళలు కూడా సొంతంగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాల‌ని నేను ఎప్ప‌టి నుంచో చెబుతున్నా. ఆపద సమయంలో వారికి తప్పకుండా మార్షల్‌ ఆర్ట్స్‌ ఉపయోగపడుతుంది.' అని సుమన్‌ తెలిపారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)