Breaking News

నటి రమ్యకు శివణ్ణ మద్దతు.. కమిషనర్‌ ఎంట్రీ.. ముగ్గురు అరెస్ట్‌

Published on Mon, 08/04/2025 - 08:40

శాండల్‌వుడ్‌ నటి, మాజీ ఎంపీ రమ్యపై అశ్లీల సందేశాలు పోస్టు చేసిన కేసుల్లో 13 మందిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసు కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. సోషల్‌ మీడియాలో కించపరిచే పోస్టులపై నగర సైబర్‌ క్రైం స్టేషన్‌ సిబ్బంది సీరియస్‌గా పని చేస్తున్నట్లు కమిషనర్‌ చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సందేశాలు పంపే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బళ్లారి, చిత్రదుర్గ, బెంగళూరు, కోలారు జిల్లాల పరిధిలో 50 అకౌంట్లపై నిఘా ఉంచిన్నట్లు తెలిపారు. 

బెంగళూరు చుట్టుపక్కల నుంచి అనేక మంది కామెంట్లు చేసినట్లు గుర్తించారు. బళ్లారికి చెందిన ఒకరు, చిత్రదుర్గకు చెందిన మరొకరితో పాటు ముగ్గురిని అరెస్ట్‌ చేసి విచారిస్తునట్లు చెప్పారు. కాగా, తన ఫిర్యాదుపై స్పందించి నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులకు నటి రమ్య ధన్యవాదాలు తెలిపారు. రేణుకస్వామిని హత్య చేసి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడంటూ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా రమ్య పలు వ్యాఖ్యలు చేశారు. మా హీరోనే విమర్శిస్తావా అంటూ దర్శన్‌ అభిమానులు ఆమెపై రెచ్చిపోయారు. ఏకంగా అత్యాచారం చేసి చంపేస్తామని మెసేజ్‌లు పంపారు. దీంతో ఆందోళన చెందిన ఆమె పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రమ్యకు శివణ్ణ మద్దతు
రమ్యపై చేసిన నీచమైన పోస్టులను ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌ ఖండించారు. రమ్యకు ఆయన మద్దతు ప్రకటించారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వారిని క్షమించలేమన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని మనవి చేశారు. సోషల్‌ మీడియాను మంచి కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)