Breaking News

రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్‌

Published on Wed, 01/11/2023 - 12:19

తమిళ సినిమా: నటుడు విజయ్‌తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్‌ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్‌ నటించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్‌ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్‌టైనర్‌ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్‌తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్‌ తనను అభినందించారని చెప్పారు.

అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్‌ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్‌ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్‌కు అజిత్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. 

ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్‌కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్‌ చెప్పుకొచ్చారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)