Breaking News

నటిపై సీమాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Mon, 03/03/2025 - 07:22

కోలీవుడ్‌ నటి విజయలక్ష్మి పడుపు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్టు నామ్‌తమిళర్‌ కట్చి కన్వీనర్‌, నటుడు సీమాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వివరాలు..విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే సీమాన్‌ లైంగిక దాడికేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరిపి, కోర్టులోచార్జ్‌ షీట్‌ దాఖలకు సిద్ధమవుతున్నారు. 

అదే సమయంలో ఈకేసు నుంచి తన పేరును తప్పించాలని కోరుతూ సీమాన్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. ఈ పరిస్థితులలో  సీమాన్‌ మరోమారు విజయలక్ష్మిపై విరుచుకుపడ్డారు. తెన్‌కాశి పర్యటనకు వెళ్తూ చైన్నె విమానాశ్రయంలో మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడులో రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుల నమోదు లేని రోజంటూ లేదని వివరిస్తూ, వీటి మీద దృష్టి పెట్టకుండా తనను అవమాన పరచడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. 

తన మీద ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి పడుపు వృత్తిలో ఉన్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ఆరోపించారు.  నగరంలో ఒక ఖరీదైన భవనం తీసుకుని ఆమెతో పాటు మరికొందరు యువతులతో ఈ వృత్తిలో ఉన్నారంటూ తెలిపారు. ఎంజాయ్‌మెంట్‌ గురించి ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ చెప్పిన ఎంజాయ్‌మెంట్‌ వితవుట్‌ రెస్పాన్స్‌ బిలిటీ అన్న వ్యాఖ్యలను తాను అనుసరిస్తున్నానని వివరించారు. పెరియార్‌ మార్గంలోనే ఇప్పుడు తానుకూడా నడుస్తున్నానని, అలాంటప్పుడు తాను ఏ తప్పు చేసినట్టో అని ప్రశ్నించారు. ఇందుకు డీఎంకే ఎంపీ కనిమొళితో పాటూ ఆ పార్టీ వర్గాలే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయలక్ష్మి తన కన్నీరే భవిష్యత్‌లో సీమాన్‌కు శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)