Breaking News

కాంతారలో ఇలా కనిపించిన స్టార్‌ నటుడు ఎవరో తెలుసా?

Published on Tue, 10/07/2025 - 07:08

కాంతార ఛాప్టర్‌–1 చిత్రం అక్టోబర్‌ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్‌ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్‌రామ్‌ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్‌, కన్నప్ప, డాకు మహరాజ్‌, విక్రమ్‌, నారప్ప, తంగలాన్‌ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్‌లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్‌శెట్టి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్‌తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న  ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.

తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్‌–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు. 

ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్‌లో కనిపిస్తాననీ, ఆ గెటప్‌ కోసం గంటన్నర పాటు మేకప్‌కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్‌ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్‌రామ్‌ పేర్కొన్నారు.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)