Breaking News

అంజనాద్రి బెట్టలో 'జై హనుమాన్‌' ప్రారంభం.. అక్కడే ఎందుకో తెలుసా?

Published on Sun, 02/22/2026 - 13:11

హనుమాన్‌ మూవీ సీక్వెల్‌ 'జై హనుమాన్‌' ప్రారంభమైంది. చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో పాటు నటుడు రిషభ్‌శెట్టి తన సతీమణి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.  కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న  అంజనాద్రి బెట్టలో లాంఛనంగా మూవీ పనులు మొదలయ్యాయి. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్‌.. బాక్సాఫీస్‌ వద్ద  కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. 

ఇప్పుడు సీక్వెల్‌లో ఆంజనేయుడి పాత్రలో రిషభ్‌శెట్టి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. రామాయణంతో ముడిపడిన ఈ మైథలాజికల్‌ భారీ యాక్షన్‌ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రశాంత్‌ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది.

అంజనాద్రి బెట్టలోనే పూజా కార్యక్రమం ఎందుకో తెలుసా..
'జై హనుమాన్‌' సినిమా పూర్తిగా ఆంజనేయుడి స్వామి చుట్టే తిరుగుతుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. అందుకే సెంటిమెంట్‌గా అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమంతో మూవీ చిత్రీకరణను ప్రారంభించారు. మన పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని  హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతారు. హనుమంతుడు అంజనా దేవికి  జన్మించారు. అందుకే ఈ ప్రాంతాన్ని అంజనాద్రి బెట్ట అని ఇప్పటికీ పిలుస్తారు. కొండ పైభాగంలో విశాలమైన హనుమాన్ ఆలయం ఉంది. 

దాదాపు 575 మెట్లు దాటుకుని పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుడి విగ్రహం, కొద్ది సమీపంలో రాముడు, సీత మందిరాలు ఉన్నాయి. అక్కడే అంజనా దేవి ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశం పురాణాలలో కిష్కిందగా పిలువబడింది. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీరు రాతి రథం, హనుమాన్ ఆలయం, యంత్ర హనుమాన్ ఆలయంతో పాటు రాముడు, హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇలా ఎన్నో మరెన్నో చూడవచ్చు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)