Breaking News

భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో

Published on Mon, 08/03/2026 - 10:03

తమిళ హీరో రవిమోహన్‌ అలియాస్ జయం రవి జీవితంలో ఇటీవల కాలంలో చాలానే సంఘటనలు జరుగుతున్నాయి. మనస్పర్థల కారణంగా భార్య ఆర్తితో విడాకుల వరకు పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. పిల్లల సంరక్షణ, ఇతరత్రా మనోవర్తిగా నెలకు రు. 40 లక్షలు అందించేలా ఆదేశించాలని ఆర్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. నెలకు రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పిల్లలను చూడటానికి రవికి అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే రవిమోహన్‌ ఇటీవల దర్శక,నిర్మాతగా మారాడు. రవిమోహన్‌ స్టూడియోస్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంగా నటుడు యోగిబాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో 'యాన్ ఆర్డినరీ మ్యాన్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలానే తాను హీరోగా 'బ్రో కోడ్'‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదలా ఉండగా రవిమోహన్‌.. 'తల్లిదండ్రుల అభినందనలు ప్రతి పిల్లలకు లభించాలి. ఇటీవల నేను దర్శకత్వం వహిస్తున్న యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌ చిత్రంలోని కొన్ని సీన్స్, నేపధ్య సంగీతాన్ని మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాను. నా కుటుంబం. ప్రత్యేకంగా మా నాన్న నా కోసం చాలా సంతోషంగా చప్పట్లు కొట్టిన తరుణం ఒక్కో పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి లభించాలి అని నేను మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను' అని ఈయన తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ ఇప్పు డు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. రవిమోహన్‌ కథానాయకుడిగా జీనీ అనే ఫాంటసీ మూవీతో పాటు రాజకీయ నేపధ్యంలో సాగే కరాటే బాబు, మిరుదన్‌ 2 త్వరలో రిలీజ్ కానున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)