Breaking News

ఇదో పిరికి చర్య: రాజీనామాలపై తంగలాన్ నటి

Published on Thu, 08/29/2024 - 08:55

హేమ కమిటీ రిపోర్ట్‌ మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్‌, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతి తిరువోతు రియాక్ట్ ‍అయ్యారు.

అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై నటి పార్వతి తిరువోతు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలా ఉందని తెలిపారు. ఫిల్మ్‌ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పేర్కొన్నారు.

ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతి తిరువోతు ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)