కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
Breaking News
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
Published on Fri, 12/23/2022 - 09:12
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కైకాల సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న ఆయన.. జూలై 25న 87వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన నివాసానికి కేక్ తీసుకెళ్లి బైడ్‌పైనే కట్ చేయించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు చిరంజీవి షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి చూపిన కైకాల చివరి వీడియో ఇదే.
కైకాల సత్యనారాయణ 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
చదవండి: నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..
Tags : 1