Breaking News

'దర్శన్‌ కోరే సౌకర్యాలు ఇవ్వడం మా వల్ల కాదు'

Published on Sun, 10/19/2025 - 07:15

హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్‌ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార  కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. తనకు ఫంగస్‌ సోకిందని దర్శన్‌ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని  దర్శన్, పవిత్రాగౌడ తదితరులు వేసుకున్న అర్జీ విచారణ 24వ తేదీకి వాయిదా పడింది.

వసతులు సాధ్యం కాదు

● దర్శన్‌కు పరుపు, దిండు ఇవ్వలేం, విచారణ ఖైదీకి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని జైలు అధికారులు స్పష్టం చేసినట్లు నివేదికలో తెలిపారు.

● దర్శన్‌ బ్యారక్‌లో దేశీయ, పాశ్చాత్య శైలి కమోడ్లు ఉన్నాయి, ఆయన గంటపాటు ఎండలో వాకింగ్‌ చేయడానికి సౌకర్యం ఉంది.

● దర్శన్‌ వాకింగ్‌ చేస్తుంటే ఇతర ఖైదీలు చూసి కేకలు వేస్తున్నారు. సెలబ్రిటీ కావడం వల్ల అతనికి కలవడానికి యత్నిస్తున్నారు. బయట వాకింగ్‌ చేయనిస్తే, జైలు చుట్టు పక్కల అపార్ట్‌మెంట్‌లలో ఉన్నవారు ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.

● టీవీ ఇవ్వలేదంటున్నారు, అందరికీ ఓ హాల్‌లో టీవీ ఉంటుంది. బ్యారక్‌లో టీవీని అమర్చడం సాధ్యం కాదు అని జైలు అధికారులు చెప్పినట్లు తెలిపారు.

● బంధుమిత్రులతో ఫోన్‌లో మాట్లాడితే కాల్స్‌ను రికార్డ్‌ చేస్తున్నారన్న దర్శన్‌ ఆరోపణలపై.. అది జైలు నియమమని చెప్పారు.

● అరికాలికి ఫంగస్‌ వచ్చి పగుళ్లు రావడం వల్ల నొప్పులు వస్తున్నట్లు తెలిపారు. దర్శన్‌ను వైద్యులు వారానికి రెండుసార్లు పరిశీలిస్తున్నట్లు నివేదికలో వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)