Breaking News

ప్రముఖ కమెడియన్‌ కుమారుడితో అర్జున్‌ కూతురు పెళ్లి

Published on Sun, 06/25/2023 - 17:07

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక అర్జున్‌ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్‌, కన్నడలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.  కానీ టాలీవుడ్‌లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి)

అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్‌ అవుతుంది.  అబ్బాయి కూడా కోలీవుడ్‌లో  ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి  ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

(ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!)

కోలీవుడ్‌లో  'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్‌గా లాంచ్‌ చేయాలని అర్జున్‌ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా  విష్వక్‌సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)