Breaking News

గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్‌

Published on Mon, 06/05/2023 - 16:21

దివంగత నటుడు అంబరీష్‌, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్‌ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్‌ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యశ్‌, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు.

నెట్టింట కొత్త జంట ఫోటోలు వైరల్‌
అభిషేక్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రజనీకాంత్‌, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే జూన్‌ 7న అభిషేక్‌-అవివాల రిసెప్షన్‌ వేడుక జరగనుంది. కాగా అభిషేక్‌-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

అభిషేక్‌ పేరెంట్స్‌ బ్యాగ్రౌండ్‌..
1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్‌, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్‌ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్‌ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్‌ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్‌ 24న అంబరీష్‌ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది.

చదవండి: ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టీవీకి ముద్దుపెట్టేవారు

Videos

విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? పెమ్మసానికి బిగ్ షాక్

పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్

గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!

నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి

ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు

ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్

మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్

ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం

బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్

Photos

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)