Breaking News

ఏఐతో అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్‌కు ఐశ్వర్య దంపతుల షాక్!

Published on Thu, 10/02/2025 - 17:01

ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ‍అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న అలాంటి వాటిని తొలగించేలా ఆదేశాలిస్తామని కోర్టు వెల్లడించింది.

తాజాగా ఈ జంట మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా గూగుల్, యూట్యూబ్‌ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ రూ.4 కోట్ల దావా వేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానెల్లో దాదాపు 259 వీడియోల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

కాగా.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు. ఆమె చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రంలో కనిపించింది.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)