ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు
Breaking News
‘బైకర్’ శర్వానంద్ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్ రెడ్డి
Published on Sun, 03/29/2026 - 10:57
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైకర్’. ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అభిలాష్ రెడ్డి కంకర మాట్లాడుతూ– ‘‘బైకర్’లో రేసింగ్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ఇది. తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. శర్వానంద్‌గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆరు నెలలు ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. 23 కేజీల బరువు తగ్గారు.
‘బైకర్’ను శర్వాగారు తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్‌గా చెప్పారు. ఇందులో శర్వాగారి తండ్రి, కోచ్ పాత్రలో రాజశేఖర్‌గారు నటించారు. ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్గార్లు, మాళవిక ... ఇలా అందరూ ‘బైకర్’ సినిమా ఫస్ట్ నరేషన్‌లోనే ఓకే చెప్పారు. ఈ కథకు అంతలా కనెక్ట్ అయ్యారు.
కథ 1990, 2000.. ఇలా రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికే దాదాపు 60 రోజులు పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి రేసర్స్‌ను తీసుకువచ్చి చిత్రీకరించాం. అలాగే 90స్లోని రెండు స్పోర్ట్స్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే రేసర్ ఉన్నారు. క్రికెటర్‌గా కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు, రేసింగ్‌లో శ్యామ్ కొఠారీకి రాలేదు.
మా సినిమా మోటివ్ కూడా ఇలాంటి గుర్తింపులు దక్కాలనే. మా నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి, హ్యాపీగా ఉన్నారు. త్రీడీలో చేద్దామని నిర్మాతలు అడిగితే నేనే వద్దన్నాను. సౌండ్, ఆర్ఆర్ విషయంలో జిబ్రాన్ సరికొత్త మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు. నా తర్వాతి సినిమా ‘దిల్’ రాజుగారితో ఉంటుంది’’ అన్నారు.
Tags : 1