Breaking News

బలమైన సందేశంతో ‘అభయ’.. 4 భాషల్లో రిలీజ్‌!

Published on Sun, 06/14/2026 - 13:31

యోగిత భోసాలె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న మ‌హిళా సాధికారిక చిత్రం ‘అభ‌య‌’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్‌.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు యూస‌ఫ్ ముజామ్మిల్ సుర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మ‌రాఠీ, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే మ‌హిళా సాధికారిత‌పై రూపొందుతోన్న ప‌వ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా గ్రాండియెంటె ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత డా.విమ‌ల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ ‘‘‘అభ‌య‌’ కేవలం సినిమా మాత్ర‌మే కాదు..స‌మాజానికి బ‌ల‌మైన సందేశం. ఈ మూవీ ద్వారా త‌ర‌త‌రాలుగా ఎంద‌రికో ప్రేర‌ణ‌గా నిలుస్తోన్న మ‌హిళ‌ల శ‌క్తి, ప‌ట్టుద‌ల‌ను సెబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా నాలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్ట‌ర్‌ను విడుదల చేయ‌టం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

RDG ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ‘‘‘అభయ’ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది.  ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా, బలమైన కథనం, అద్భుతమైన నటీన‌టుల‌తో రూపొందింది. ఈ ప్రేరణాత్మక సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

ఈ చిత్రంలో యోగిత భోసాలె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమాలో ఇంకా మోహ‌న్ జోషి, గ‌ణేష్ యాద‌వ్‌, క‌మ‌లేష్ సావంత్‌, అనికేత్ కేల్‌క‌ర్‌, రోహిత్ కోక‌టి, ఉమేష్ బోల్కె, డా.సంజీవ్ కుమార్ పాటిల్‌, హ‌ర్ష్ నిక‌మ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)