Breaking News

రజినీకాంత్, నయన్‌ బాటలో యంగ్‌ హీరోయిన్.. అదేంటో తెలుసా?

Published on Fri, 09/29/2023 - 12:18

ఆస్తికం, నాస్తికం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది. ఆస్తికులు భక్తి బాట పడితే.. నాస్తికులు సైన్సును నమ్ముతారు. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ప్రముఖ స్టార్ రజినీకాంత్‌ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే.. ఆయన స్నేహితుడు, విశ్వనటుడు కమలహాసన్‌ నాస్తికతకు ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా నటి నయనతార పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా గుళ్లు, గోపురాలు తిరిగొచ్చారు. 

(ఇది చదవండి: బుల్లితెరపై యాంకర్‌గా సన్నీలియోన్‌.. ఎవరికి చెక్‌ పెడుతుందో)

తాజాగా మరో యువ నటి ఆత్మిక సైతం నయనతార, రజినీకాంత్‌ తరహాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. హిప్‌ హాప్‌ తమిళా ఆదికి జంటగా మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కోడియిల్‌ ఒరువన్‌, కాట్టేరి, కన్నై నంబాదే, తిరువిన్‌ కాదల్‌ చిత్రాల్లో నటించారు. కాగా ఈమె ప్రస్తుతం భక్తి బా ట పట్టడం విశేషం. ఆద్మిక ప్రస్తుతం రజినీకాంత్‌ తరహాలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ బాబాజీ గుహలో ధ్యానం చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. 

దీని గురించి ఆత్మిక స్పందిస్తూ తన ఆధ్యాత్మిక పయనం అన్నది ఆత్మ ఆదేశం అని పేర్కొన్నారు. బాబాజీ గుహకు వెళ్లాలని దైవమే పిలుపు వచ్చిందన్నారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరినట్లు చెప్పారు. అయితే ఇది తనకు మరణ అనుభవాన్ని చవిచూసే అనుభవమని పేర్కొన్నారు. అయితే కొన్ని మంచి పరిణామాలు సులభంగా కలిగాయని చెప్పారు. బాబాజీ గుహలో ధ్యానం కోసంకూర్చున్నప్పుడు కలిగిన దైవిక అనుభూతిని జీవితాంతం మరిచిపోలేనన్నారు. ఆ తర్వాత జీవితంపై తన దృష్టి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ లోకంలోని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా ఇలాంటి అనుభవాన్ని పొందాలని ఆత్మిక పేర్కొన్నారు.

(ఇది చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)