Breaking News

తేజ ఎలిమినేట్‌.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్‌

Published on Mon, 11/06/2023 - 08:52

బిగ్‌ బాస్‌ సీజన్‌ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్‌ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్‌ అయిన ఆట సందీప్‌ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు.

ఎనిమిదో వారంలో సందీప్‌ నామినేషన్‌ లిస్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం తేజ  అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్‌ కావడం ఆపై సందీప్‌ ఎలిమినేషన్‌ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్‌కు కారణం శివాజీ.. నామినేషన్‌ సమయంలో సందీప్‌ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్‌ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్‌ నడిచింది. బిగ్‌ బాస్‌లో ఉన్నంత వరకు అమర్‌,శోభ బ్యాచ్‌లో సందీప్‌ ఉన్నాడు.. కానీ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్‌,తేజ ఆట గురించి నెగటివ్‌గా మాట్లాడటం జరిగింది.

ఇప్పటికే రతికా రోజ్‌కు  రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్‌కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్‌బాస్‌ టీమ్‌ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్‌ శివాజీ టీమ్‌ వైపు ఉంటాడా..? అమర్‌ బ్యాచ్‌ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్‌ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్‌ బాస్‌లో సంచాలక్​గా​ మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్‌ లేకుండా హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)