Breaking News

అల్లు అర్జున్‌ అంటే ఇష్టం..ఆలియా నా ప్రేరణ:ఆరతి గుప్తా

Published on Tue, 04/22/2025 - 18:29

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సోదరా'.   అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న 'సోదరా' చిత్రానికి మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకుడు.  క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మంగళవారం ఆరతి గుప్తా విలేకరులతో ముచ్చటించారు ఆ విశేషాలివి.  

చంఢీగడ్‌ పుట్టి పెరిగిన నేను ముంబయ్‌లో స్థిరపడ్డాను. ఇంతకు ముందు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించాను. కానీ తెలుగులో నా తొలి చిత్రం 'సోదరా'

కథ నచ్చి సోదరా  ఒప్పుకున్నాను. లైట్‌ హార్టెడ్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా మీ స్నేహితులు, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎవరితోనైనా చూడొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా బాగా నచ్చింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. సింపుల్‌ విలేజ్‌ గర్ల్‌. చదువున్న అమ్మాయి. ఇన్నోసెంట్‌, అండ్‌ డిగ్నిఫైడ్‌. పాత్ర అది.

సంపూ, సంజోష్‌లతో కలిసి నటించడం సంతోషంగా ఉంది.ఇద్దరూ ఎంతో స్వీట్‌ పర్సన్‌. ఎంతో కో ఆపరేటివ్‌. ఇద్దరూ సెట్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్‌ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పుడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది.

దర్శకుడు మోహన్‌ గారు ఎంతో కోఆపరేటివ్‌, ఎంతో సపోర్ట్‌ చేస్తారు. పర్‌ఫార్మ్‌ చేయడానికి స్కోప్‌  వున్ పాత్రను ఇచ్చారు. ఆయన వల్లే బాగా నటించగలిగాను. సంపూర్షేష్‌ బాబు అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ యాక్టర్‌ అని తెలుసు. సంపూకు ఉన్న ఫ్యాన్స్‌ బేస్‌ తెలుసు. ఆయన గత చిత్రం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ సినిమా చూశాను.

ఇంతకు ముందు ట్రెడిషినల్‌ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్‌గానే ఉంటాను. నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలోచేశాను.

అన్ని తరహా పాత్రలు, అన్నీ తరహా సినిమాలు చేయాలని ఉంది. అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బాగా యాక్ట్‌ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం.  ఒకవేళ  అందంగా ఉండి యాక్ట్‌ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం.  పర్‌ఫార్మన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత.

అలియాభట్ అంటే  నాకు చాలా ఇష్టం. ఆమె జర్నీ , ఆమె చేసిన పాత్రలు నాలో ప్రేరణను నింపాయి. ఆమె సినిమాల సెలక్షన్‌ కూడా బాగుంటుంది. టాలీవుడ్‌లోఅల్లు అర్జున్‌ గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలన్ని చూస్తాను. 

→ తెలుగు సినిమాలో టైమ్‌ పంక్చూవాలిటి చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టుల ప్రొఫెషనలిజం కూడా చాలా ఇష్టం. ప్రతి ఆర్టిస్టును సమానంగా చూడటం నాకు చాలా నచ్చింది.  తెలుగు సినిమా గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)