Breaking News

'సింగర్‌తో తిరుమలకు హీరో'.. జయం రవి భార్య ఆసక్తికర పోస్ట్!

Published on Tue, 08/26/2025 - 15:53

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తన భార్య ఆర్తితో విభేదాలు రావడంతో ఇప్పటికే డివోర్స్‌ తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత  ప్రముఖ సింగర్‌ కెన్నీషాతో జయం రవి కనిపించడంతో వారిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఓ పెళ్లిలో వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉంటూ కనిపించారు. అంతేకాకుండా తమ మధ్య విభేదాలకు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆర్తి కూడా ఆరోపించింది.

తాజాగా సింగర్‌ కెన్నీషా ఫ్రాన్సిస్‌తో కలిసి జయం రవి తిరుమలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో మరోసారి వీరిద్దరి విడాకుల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది చూసిన ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..'నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ, దేవుడిని మోసం చేయలేవు' అని తన స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. అయితే జయం రవి- కెన్నీషా తిరుమల దర్శనాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ పోస్ట్‌ పెట్టి ఉంటారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా.. చెన్నైలో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందు రవి, కెనీషా తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

మరోవైపు ఈ జంట విడాకులు ప్రకటించిన సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్తి తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)