Breaking News

Aaron Taylor-Johnson: కొత్త జేమ్స్‌ బాండ్‌?

Published on Thu, 03/21/2024 - 03:57

హాలీవుడ్‌ ‘జేమ్స్‌ బాండ్‌’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్‌. ‘జేమ్స్‌ బాండ్‌’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెగ్‌ ఎక్కువ సార్లు జేమ్స్‌ బాండ్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించారు. 2021లో వచ్చిన జేమ్స్‌ బాండ్‌ 25వ చిత్రం ‘జేమ్స్‌ బాండ్‌: నో టైమ్‌ టు డై’లోనూ డేనియల్‌ క్రెగ్‌ బాండ్‌గా కనిపించారు. తాజాగా జేమ్స్‌ బాండ్‌ 26వ సినిమా గురించిన వార్తలు హాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తొలుత డేనియల్‌ క్రెగ్‌ పేరు వినిపించింది.

కానీ మరోసారి బాండ్‌గా కనిపించేందుకు డేనియల్‌ ఆసక్తికరంగా లేరట. దీంతో కొత్త జేమ్స్‌ బాండ్‌గా ఎవరు కనిపిస్తారు? అనే చర్చ హాలీవుడ్‌లో మొదలైంది. ఈ క్రమంలో ఆరోన్‌ టేలర్‌ జాన్సన్‌ పేరు తెరపైకి వచ్చింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్‌ బాండ్‌గా ఆరోన్‌ పర్‌ఫెక్ట్‌ చాయిస్‌ అంటున్నారు కొందరు హాలీవుడ్‌ సినీ ప్రేమికులు. అలాగే ‘జేమ్స్‌బాండ్‌ 26’వ చిత్రానికి క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక హాలీవుడ్‌ చిత్రాలు ‘కిక్కాస్‌’, ‘చాట్‌ రూమ్‌’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్‌’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఆరోన్‌ టేలర్‌.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)