Breaking News

సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం: ఆమిర్‌ ఖాన్‌

Published on Wed, 03/12/2025 - 02:42

‘‘గతంలో ఏ సినిమా చూడాలనుకున్నా థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఎందుకంటే మూవీస్‌ చూసేందుకు నాకు మరో చాయిస్‌ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీల్లో రిలీజ్‌ చేసి, మన సినిమా వ్యాపారాన్ని మనమే చంపేశాం’’ అని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan) ఆగ్రహావేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 14న ఆమిర్‌ ఖాన్‌ బర్త్‌ డేని పురస్కరించుకుని ‘పీవీఆర్‌ ఐనాక్స్‌’ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ‘ఆమిర్‌ ఖాన్‌: సినిమా కా జాదూగర్‌’ పేరుతో ఆయన హిట్‌ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమిర్‌ ఖాన్, రచయిత జావేద్‌ అక్తర్‌ పాల్గొన్నారు. ‘‘గతంతో పోలిస్తే ప్రస్తుతం హిందీ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.

బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం లేని దక్షిణాది నటుల సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 600 నుంచి 700 కోట్ల రూపాయలు  వ్యాపారం చేస్తున్నాయి. మన సినిమాలను కూడా దక్షిణాది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అంటూ ఆమిర్‌ ఖాన్‌ను ప్రశ్నించారు జావేద్‌ అక్తర్‌. ఇందుకు ఆమిర్‌ స్పందిస్తూ– ‘‘దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు అనే విషయం సమస్యే కాదు... దర్శకులప్రాంతీయ నేపథ్యం కూడా అప్రస్తుతం.

సినిమా విడుదలైన ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నాం. ఓటీటీలో ఎన్నిసార్లయినా ఫ్రీగా చూసే వీలుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఒక సినిమాని రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీల్లో రిలీజ్‌ చేయాలి.

అప్పుడే థియేట్రికల్‌ బిజినెస్‌ బాగుంటుంది. ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్‌ మీద బాలీవుడ్‌ రచయితలు, డైరెక్టర్స్‌ ఎక్కువ ఫోకస్‌ చేయడం లేదు. కేవలం వినో దానికే పెద్ద పీట వేస్తున్నారు. పైగా మూలాలను మర్చిపోతున్నారు. దక్షిణాది చిత్రాల్లాగా భావోద్వేగాలను మిళితం చేయలేపోతున్నారు’’ అని పేర్కొన్నారు.  

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)