Breaking News

సలార్‌ హీరో సాహసం.. ఆ సీన్‌ కోసం ఏకంగా మూడు రోజులు!

Published on Tue, 04/02/2024 - 18:33

సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది.  బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు. 

అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్‌ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. 

అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్‌కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్‌ షాట్‌కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)