Breaking News

‘కిరాతక’గా ఆది సాయికుమార్‌.. పాయల్‌తో రొమాన్స్‌కి రెడీ

Published on Tue, 06/22/2021 - 13:53

ఆది సాయికుమార్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాత‌క‌` అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న‌ ఈ మూవీలో ఆది సాయికుమార్ స‌ర‌స‌న హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ - ‘ఆది కుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. మరోసారి మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఆది స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా సినిమాకి ప్ల‌స్ అవుతాయి`` అన్నారు.

చిత్ర‌ నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ -  ‘‘మా విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీర‌భ‌ద్రం గారి కాంబినేష‌న్‌లో `కిరాత‌క‌`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం’ అన్నారు.

Videos

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)