Breaking News

మరోసారి భయపెట్టబోతున్న ఆది సాయికుమార్‌!

Published on Mon, 02/09/2026 - 17:54

‘శంబాల’ చిత్రంతో రీసెంట్‌గా ఆది సాయి కుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది అని చిత్రయూనిట్ చెబుతోంది.

ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ స్వాధీనం చేసుకోవడం విశేషం. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై కంటిన్యూగా అప్డేట్‌లను ఇస్తామని టీం చెబుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)