ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
టాప్ హీరో ఛీ కొట్టిన స్టోరీ కీ జై కొట్టిన బన్నీ... ఏమిటా ధైర్యం?
Published on Thu, 01/15/2026 - 13:23
ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్టర్, అంతకుమించి హీరోల్ని సరిగా డీల్ చేయలేని డైరెక్టర్ గా ముద్ర పడిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు బన్నీ, లోకేష్ కనగరాజ్ ల కాంబో సంచలనం గా మారింది.
టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాల ఫ్యాన్స్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ కాంబో. భారీ విజయాలను అందించిన పుష్ప 2: ది రూల్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ టాలీవుడ్ స్టార్‌ను దాటిపోయాడు పాన్-ఇండియా సూపర్ స్టార్ రేస్ లో సగర్వంగా నిలబడ్డాడు. మరోవైపు కూలీ వంటి భారీ చిత్రం ద్వారా బోలెడంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు లోకేష్. పెద్ద హీరోల్ని డీల్ చేయలేకపోయాడనే తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు రజనీ-కమల్ కాంబో సినిమా తో పాటు మరికొన్ని భారీ చిత్రాల ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అనేది సినీ పండితుల అంచనాలకు అందడం లేదు. వినవస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో లో రూపొందనున్నచిత్రం ఓ సూపర్ హీరో సినిమా కావచ్చు. దీనిపై అనేక అంచనాలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అధికారిక ప్రకటనలు ఇంకా రానప్పటికీ జోరుగా ఊహగానాలు సాగుతున్నాయ్. ఇది భారతీయ సినిమాలో సూపర్ హీరో కథలను మరో గమ్యం వైపు నడిపే అవకాశం ఉందని అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఒక కల్చరల్ చరిత్రనూ సృష్టించడం ఖాయమని లోకేష్ టాలెంట్ పట్ల నమ్మకం వున్నవారు అంటున్నారు.
అయితే ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన స్టోరీ సూర్య హీరో గా లోకేష్ సారద్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రం ఇరుంబుకై మాయవి తరహా అనీ, ఈ సినిమా ఆలోచన మొదట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో చర్చిస్తే ఆయన తిరస్కరించాడని దీనిని బన్నీ ఓకే చేయడం విచిత్రం గా ఉందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పుష్ప సిరీస్ తో అనూహ్యమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అయన భవిష్యత్ కు చాలా కీలకం గా మారనుంది అనేది నిస్సoదేహం. తన తదుపరి చిత్రానికి టాప్ డైరెక్టర్ అట్లీ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ఛాయిస్ గా ప్రశంసలు అందుకున్న ఐకాన్ స్టార్ ఆ తర్వాత లోకేష్ ను ఎంచుకోవడం ఖరారైతే అది పెద్ద సాహసం గానే చెప్పాలి.
Tags : 1