Breaking News

కమల్‌ హాసన్‌ చిత్రంలో ఏడుగురు స్టార్‌ హీరోలు!

Published on Fri, 01/20/2023 - 08:14

కోలీవుడ్‌లో ప్రయోగాలకు ఆద్యుడు లోకనాయకుడు కమలహాసన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, అపూర్వ సహోదర్‌ గళ్, దశావతారం ఇలా చెప్పుకుంటూ పోతే కమల్‌ హాసన్‌ కెరీర్‌లో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల విక్రమ్‌ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన కమలహాసన్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌– 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన తన గెటప్‌ కోసం అనేక గంటలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ చిత్రం తర్వాత కమలహాసన్‌ మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. కాగా కమలహాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో నాయకన్‌ చిత్రం రూపొంది సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్‌ కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఇంకా పేరు నిర్ణయం కాని ఈ చిత్రంలో కమలహాసన్‌తో పాటు ఏడు రాష్ట్రాలకు చెందిన స్టార్‌ హీరోలు నటించనున్నారు. ఆ ఏడుగురులో బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ ఒకరనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. మరో విశేషం ఏంటంటే కమలహాసన్, షారుక్‌ ఖాన్‌ ఇంతకుముందు హే రామ్‌ అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.     

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)