Breaking News

ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌

Published on Fri, 11/21/2025 - 01:08

‘‘భారతీయ దర్శకులు, నిర్మాతలు, కథారచయితలు... ఇలా అందరూ ప్రపంచాన్ని కలుసుకునే వేదిక ఇది. గోవాను క్రియేటివ్‌ క్యాపిటల్‌గా మలిచే దిశగా కృషి చేస్తున్నాం. చిత్ర నిర్మాణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గోవా ఫిల్మ్‌ మేకర్స్‌ను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) గురువారం భారీ పరేడ్‌ నేపథ్యంలో గోవా గవర్నర్‌ అశోక గజపతిరాజు ప్రారంభించారు. 2004లో మనోహర్‌పారికర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇఫీలోపాల్గొడానికి గోవా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అశోక గజపతిరాజు గుర్తుచేసుకున్నారు.

50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన ఘనతకు గుర్తింపుగా ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘ఇఫీ వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సనాతన ధర్మం సత్తా చూపించేలా ‘అఖండ 2’ రూ పొందింది. ప్రస్తుతం నటనని గ్రాఫిక్స్‌ డామినేట్‌ చేస్తున్నాయి. అయితే నా సినిమాలను గమనిస్తే నేనే వాటిని డామినేట్‌ చేస్తాను’’ అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఔత్సాహిక యువతను ప్రోత్సహించేందుకు మారియట్‌ హోటల్‌లో కేంద్ర మంత్రి మురుగన్‌ ఆరంభించిన ‘వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌–2025’ ప్రారంభ కార్యక్రమంలో కూడా బాలకృష్ణపాల్గొన్నారు.

టాలీవుడ్‌ సందడి: ‘ఇఫీ’ కార్యక్రమాల్లో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగాపాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీలీల, ‘దిల్‌’ రాజు, సి కల్యాణ్, మాదాల రవి, వీరశంకర్, భరత్‌ భూషణ్‌ తదితరులుపాల్గొన్నారు. ‘‘్రపాంతీయ భాష నుంచిపాన్‌ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ప్రాంతాలకు అతీతంగా ఇంతమందిని ఒక్కటి చేసి ఇండియన్‌ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ‘ఇఫీ’లాంటి వేదికలు ఉపకరిస్తాయి’’ అన్నారు ‘దిల్‌’ రాజు, మాదాల రవి. హిందీ పరిశ్రమ నుంచి అనుపమ్‌ ఖేర్, రాకేష్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా, శేఖర్‌ కపూర్, జాకీ ష్రాఫ్‌ తదితరులు హాజరయ్యారు.         – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)