Breaking News

ఓటీటీలో హిట్‌ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్‌

Published on Fri, 09/27/2024 - 15:03

'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌  6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్‌ను మేకర్స్‌ ఇచ్చారు.

నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  రానా, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి  నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్‌ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్‌మీడియాలో ఆహా  ప్రకటించింది.

కథేంటంటే..
తిరుపతికి చెందిన ప్రసాద్‌(విశ్వదేవ్‌ రాచకొండ) ఓ బస్‌ కండక్టర్‌. భార్య సరస్వతి(నివేదా థామస్‌), పిల్లలు అరుణ్‌, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్‌ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.

కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్‌ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే ప‌ది ఎందుకవుతుంద‌ంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్‌ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్‌ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్‌ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్‌ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్‌ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్‌ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్‌ లెక్కల్లో కనీసం పాస్‌ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)