Breaking News

ఆహాలో 'మదర్స్‌ డే 'కానుక.. ఉచితంగానే నివేదా థామస్ హిట్‌ సినిమా

Published on Sat, 05/10/2025 - 10:36

‘హ్యాపీ మదర్స్‌ డే అమ్మా!’ అంటూ.. మే 11న కొంత సమయం అయినా సరే అమ్మతో సంతోషంగా గడుపుతారు. ఆమ్మ ప్రేమ గురించి వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్‌ హిట్‌ అందుకున్నాయి కూడా.. అయితే, ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి  '35–చిన్న కథ కాదు' సినిమాను చూసేయండి. ఉచితంగానే ఈ చిత్రాన్ని చూడొచ్చని ఆహా తెలుగు ప్రకటించింది. మే 10, 11 తేదీలలో మాత్రమే ఈ ఛాన్స్‌ ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాదిలో తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. మదర్స్‌డే (మే 11) కానుకగా ఉచితంగా చూసేందుకు ఆహా సంస్థ అవకాశం కల్పించింది. నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  రానా, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి  నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

కథేంటంటే..
తిరుపతికి చెందిన ప్రసాద్‌(విశ్వదేవ్‌ రాచకొండ) ఓ బస్‌ కండక్టర్‌. భార్య సరస్వతి(నివేదా థామస్‌), పిల్లలు అరుణ్‌, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్‌ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.

కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్‌ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే ప‌ది ఎందుకవుతుంద‌ంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్‌ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్‌ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్‌ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్‌ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్‌ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్‌ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్‌ లెక్కల్లో కనీసం పాస్‌ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)