Breaking News

వాస్తవాలే లక్ష్యంగా ‘1948 - అఖండ భారత్’

Published on Thu, 08/11/2022 - 15:19

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్  తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  

ఈ చిత్ర విడుదలను పుర్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ... "గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం... కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తమ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు.  

‘70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం... మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం' అన్నారు

 
చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ...11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి... 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో...  ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అన్నారు.

ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని... దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్... ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే... ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు.  ‘1948 - అఖండ భారత్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

Videos

జగన్ దంపతులను అనరాని మాటలు అన్నావ్ ఎగిరావ్.. ఎగిరావ్...బొక్క బోర్లా పడ్డావ్

ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్ నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం

గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సుధీర్‌రెడ్డి

స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి

Drugs Case: పదేళ్లు జైలు శిక్ష! అడ్వకేట్ షాకింగ్ కామెంట్స్

TS: సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

అమెరికా బలగాల అదుపులో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో

బర్సె దేవాతో పాటు లొంగిపోయిన మరో 20 మంది మావోయిస్టులు

East Godavari: రైస్ మిల్లర్ల భారీ మోసం... పవన్.. దమ్ముంటే ఇప్పుడు సీజ్ చెయ్

Photos

+5

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే? (ఫొటోలు)

+5

కజిన్ పెళ్లిలో హృతిక్ రోషన్ సందడే సందడి (ఫొటోలు)

+5

‘సైక్‌ సిద్ధార్థ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్‌ (ఫొటోలు)

+5

మణికొండలో సందడి చేసిన నటి దివి వద్త్య (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మహా నగరంపై మంచు తెర..(ఫొటోలు)

+5

టీటీడీ విజిలెన్స్‌.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)