Breaking News

ఆ రికార్డ్‌ అందుకున్న ఏకైక ఇండియన్‌ చిత్రంగా '12th Fail'

Published on Fri, 02/09/2024 - 11:38

అనురాగ్‌ పాథక్‌ రచించిన 12Th Fail అనే నవలను ఆధారంగా చేసుకుని.. అదే పేరుతో బాలీవుడ్‌ దర్శకుడు విధూ వినోద్ చోప్రా సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది.  తాజాగా ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఫైనల్‌ IMDb రేటింగ్‌ 9.2 దక్కింది. కొద్దిరోజుల క్రితం  69వ 'ఫిలిం ఫేర్‌' అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే వంటి ఐదు అవార్డులను గెలుచుకుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు  12Th ఫెయిల్‌ చిత్రం అంతర్జాతీయంగా కూడా దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 250 ఉత్తమ చిత్రాల జాబితాలో ఈ మూవీకి చోటు దక్కింది. ఏకంగా టాప్‌- 50లో ఈ సినిమా ఉండటం విశేషం. ఈ సంతోషకరమైన అప్‌డేట్‌ని దర్శకుడు విధు వినోద్ చోప్రా తన సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. టాప్‌ -50లో చేరిన ఏకైక ఇండియన్‌ చిత్రంగా 12Th ఫెయిల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఎందరినో మెప్పించిన ఈ సినిమా నిజమైన ఒక వ్యక్తి జీవితం అని తెలిసిందే. ముంబయి మహానగర అడిషనల్‌ కమిషనర్‌ మనోజ్‌ జీవితమే ఈ కథ. మనోజ్‌ జీవిత కథను ఆయన మాజీ రూమ్‌మేట్‌ పాండే ఉరఫ్‌ అనురాగ్‌ పాథక్‌ 12Th ఫెయిల్‌  అనే పుస్తకంగా రాశాడు. దాన్నే- ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఆయన పాత్రలో కనిపించిన విక్రాంత్‌ మస్సే నటనకు సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మేధా శంకర్‌ కనిపించారు. ఒక్కసారిగా ఆమె బాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)