Breaking News

యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్‌’

Published on Tue, 05/07/2024 - 16:39

రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్  కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘100 క్రోర్స్‌’.  2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విరాట్‌ చక్రవర్తి. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా వ్యవహరించారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

‘100 క్రోర్స్ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అన్నారు దామోదర ప్రసాద్‌. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి’ అన్నారు వీర శంకర్‌.

‘2016లో జరిగిన యథార్థ కథ. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాత సాయి కార్తీక్‌.  ఈ మూవీకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)