Breaking News

దళితబంధు జాబితాలో అనర్హులు

Published on Sat, 10/07/2023 - 07:46

వైరారూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులకు కేటాయిస్తున్నారని మండలంలోని పాలడుగు దళితులు శుక్రవారం సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఐదుగురికి పథకం మంజూరు కాగా, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారేనని తెలిపారు.

కాగా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వైరా ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ చేరుకుని ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడించగా వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ధర్నా వద్ద ఆగిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రపాద్‌ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  
దళితబంధు రాలేదని దీక్ష  
కారేపల్లి: అన్ని అర్హతలు ఉన్నా తనకు దళిత బంధు రాలేదంటూ కారేపల్లికి చెందిన ఆదెర్ల రాధాగోవింద్‌ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష చేపట్టారు. దళితబంధు జాబితాలో పేరు చేర్చేందుకు కొందరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, తాను డబ్బు ఇవ్వకపోవడంతో గుర్తించలేదని వాపోయారు. ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు వై.ప్రకాశ్, బోళ్ల రామస్వామి, కొమ్ము ఉపేందర్, గౌసుద్దీన్, ప్రసాద్‌ మద్దతు తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)