న్యూయార్క్‌ మేయర్‌గా మమ్దాని 

Published on Thu, 11/06/2025 - 05:37

న్యూయార్క్‌: భారతీయ–అమెరికన్, డెమొక్రటిక్‌ పార్టీ నేత జొహ్రాన్‌ మమ్దాని(34) చరిత్ర సృష్టించారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్‌ నగర మేయర్‌గా ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మతస్థుడిగా, దక్షిణాసియా మూలాలున్న తొలి వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కారు. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

 ప్రఖ్యాత బాలీవుడ్‌ దర్శకురాలు, పంజాబీ హిందూ మీరా నాయర్‌ కుమారుడైన మమ్దాని న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో మాజీ గవర్నర్, స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ కుమో, రిపబ్లికన్‌ నామినీ కురి్టస్‌ స్లివాను సునాయాసంగా ఓడించారు. 50 శాతానికి పైగా ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. ట్రంప్‌ అండతో బరిలోకి దిగిన ఆండ్రూ కుమో ఓటమి పాలయ్యారు.

 ఆయనకు 41 శాతం ఓట్లే లభించాయి. కురి్టస్‌ స్లివాకు కేవలం ఏడు శాతం ఓట్లు రావడం గమనార్హం. మమ్దాని అధ్యక్షుడిగా ఎన్నికైతే న్యూయార్క్‌కు కనీస అవసరాలకు సరిపడినంత మాత్రమే నిధులు కేటాయిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. పైగా మమ్దాని కమ్యూనిస్టు అని, ఆయనకు ఓటు వేయొద్దని ప్రజలకు స్వయంగా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ జనం మమ్దానికి పట్టం కట్టారు. దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మమ్దానికి 10,36,051(50.4 శాతం), కుమోకు 8,54,995 (41.6 శాతం), స్లివాకు 1,46,137 (7 శాతం) ఓట్లు లభించాయి.  

111వ ప్రథమ పౌరుడు  
జొహ్రాన్‌ మమ్దాని వచ్చే ఏడాది జనవరిలో న్యూయార్క్‌ 111వ ప్రథమ పౌరుడిగా బాధ్య తలు చేపట్టబోతున్నారు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముస్లిం యువకుడు నెగ్గడం అమెరికన్ల ఆలోచనాధోరణిలో వస్తున్న మార్పునకు ప్రతీక అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై ప్రజాగ్రహానికి ఉదాహరణ అని అంచనా వేస్తున్నారు. ప్రగతిశీల రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. మరోవైపు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్‌ ఎన్నికల్లోనూ డెమొక్రటిక్‌ అభ్యర్థులే విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్‌ అభ్యర్థులకు పరాభవం ఎదురైంది.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)