Breaking News

ముందు కాల్పుల విరమణ 

Published on Mon, 05/12/2025 - 05:44

మాస్కో/కీవ్‌: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 30 రోజులపాటు సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ పాటించాలని యూరప్‌ ప్రధాన దేశాల నేతలు ఇచ్చిన పిలుపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శనివారం రాత్రి స్పందించారు. ఎలాంటి షరతులు లేకుండా తుర్కియేలోని ఇస్తాంబుల్‌ వేదికగా ఉక్రెయిన్‌తో తక్షణమే ముఖాముఖి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. చర్చల సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశముంటుందని పుతిన్‌ పేర్కొన్నారు. 

అయితే, కాల్పుల విరమణను ముందుగా అమల్లోకి వచ్చాకే చర్చలకు కూర్చుందామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ చర్చలకు సానుకూల సంకేతమని తెలిపారు. దీని కోసమే యావత్‌ ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కాగా, పుతిన్‌ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హర్షం ప్రకటించారు. ‘ఈ ప్రతిపాదన రెండు దేశాలకూ మంచిదే. చర్చలకు అవకాశం కల్పించేందుకు రెండు దేశాలతోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’అని పేర్కొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)