Breaking News

ఎడారిలో ఎనిమిదేళ్ల చిన్నారి... 15 కిలోమీటర్లు నడక

Published on Wed, 02/04/2026 - 01:10

మస్కట్‌లో ఓఎనిమిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. ఉత్తర షర్కియాలోని బిడియా ప్రాంతంలోని ఎడారిలో బాలుడు తప్పిపోయాడు.15 కిలోమీటర్లు ఏకాకిగా తీవ్రమైన ఉష్ణోగ్రతలో నడిచిన చిన్నారి ఎట్టకేలకు అక్కడి అధికారులకు దొరికాడు.            

సాధారణంగా ఎండాకాలంలో ఇసుకలో నడిస్తేనే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఏడారి ప్రాంతంలో అయితే ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దప్పిక, తీవ్రమైన వేడిమి, ఎక్కడ ముగింపు ఉంటుందో తెలియదు. ఇక ఆ ఆలోచనే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఒమన్ దేశం మస్కట్‌లో చిక్కుకపోయిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. ఎవరికి తెలియని దారిలో దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎండ, వేడిమిని భరిస్తూ దాహాన్ని తట్టుకుంటూ ఒంటరిగా పయణించాడు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఎట్టకేలకు సురక్షితంగా బయిటపడ్డాడు.

తమ పిల్లాడు ఎడారిలో తప్పిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో  ఉత్తర షర్కియా భద్రత విభాగం వెంటనే అప్రమత్తమై  తప్పిపోయిన బాలుడి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టింది.  సివిల్ డిఫెన్స్ అంబులెన్స్  అథారిటీ ప్రకారం దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల పాటు శ్రమించిన తర్పాత  ఎట్టకేలకు ఆ బాలుడి జాడను అధికారులు  కనుగొన్నారు.

అంత కఠినమైన ఏడారిలో నీరు లేకుండా, ఎండ వేడిమిని తట్టుకొని ఆ చిన్నారి దాదాపు 15 కిలోమీటర్ల నడిచినట్లు తెలిపారు. అయితే విహారయాత్రలకు వెళ్లినప్పడు గానీ క్యాంపు ఫైర్ చేసిన ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)