Breaking News

రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. 22 మంది మృతి

Published on Sun, 09/01/2024 - 16:27

మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్‌ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్‌ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్‌ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో  హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.

హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్‌.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్‌ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.

వచ్కజెట్స్‌ సమీపంలో రాడార్‌ నుంచి హెలికాప్టర్‌ మాయమైంది.  ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)