Breaking News

మనతో రోబో రన్‌!

Published on Wed, 01/22/2025 - 04:12

ఎన్నో రంగాల్లో మనిషికి సవాల్‌ విసురుతున్న మరమనుషులను చైనా.. ప్రపంచంలోనే తొలిసారిగా చరిత్రాత్మక పోటీకి రంగంలోకి దింపుతోంది. అథ్లెట్లు, హ్యూమనాయిడ్‌ రోబోలకు కలిపి మొట్టమొదటిసారిగా హాఫ్‌ మారథాన్‌ (21 కి.మీ.) పరుగు పందెం నిర్వహించనుంది. 

ఏప్రిల్‌లో జరగనున్న ఈ పోటీకి చైనా రాజధాని బీజింగ్‌లోని డాక్సింగ్‌ జిల్లా వేదిక కానుంది. ఇందులో డజన్లకొద్దీ హ్యూమనాయిడ్‌ రోబోలు సుమారు 12 వేల మంది అథ్లెట్లతో పోటీపడనున్నాయి. ఈ రేసులో టాప్‌–3లో నిలిచే రేసర్లకు (అథ్లెట్లు అయినా లేక హ్యూమనాయిడ్‌ రోబోలైనా) బహుమతులిస్తారని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’తెలిపింది. 

బీజింగ్‌ ఆర్థిక–సాంకేతికత అభివృద్ధి ప్రాంతం లేదా ఈ–టౌన్‌ పరిపాలనా సంఘం ఈ వినూత్న పోటీని నిర్వహించనుంది. 20కన్నా ఎక్కువ రోబో తయారీ సంస్థలు హాఫ్‌ మారథాన్‌లో పాల్గొననున్నాయి.

స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ‘టియాంగోంగ్‌’ 
మారథాన్‌లో పాల్గొనే రోబోలలో చైనాకు చెందిన ఎంబాడీడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబోటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన టియాంగోంగ్‌ హ్యూమనాయిడ్‌ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

ఈ రోబోకు గంటకు సగటున 10 కి.మీ. వేగంతో పరిగెత్తే సామర్థ్యం ఉందని ‘ద డైలీ సీపీఈసీ’పేర్కొంది. గతేడాది బీజింగ్‌లో జరిగిన హాఫ్‌ మారథాన్‌లో రేసు మొదలైనప్పటి నుంచి చివరిదాకా ఈ రోబో మనుషులతో కలిసి పరుగెత్తింది.

చైనాలో రోబోల అభివృద్ధి ఎందుకంటే.. 
చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో శ్రామికశక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్నా.. ఆర్ధికవృద్ధిని పెంచాలన్నా శ్రామికశక్తి అవసరం.

దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్‌ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చైనా ఆగస్టులో హ్యూమనాయిడ్‌ రోబోలతో ఫుట్‌బాల్, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ లాంటి పోటీలు నిర్వహించనుంది.      – సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

కండిషన్స్‌ అప్లై..
హాఫ్‌ మారథాన్‌లో పాల్గొనే రోబోలవిషయంలో చైనా కొన్ని షరతులు విధించింది. అవేమిటంటే.. 
»  రోబోలన్నీ మనిషి ఆకృతిలో కనిపించాలి. 
»    వాకింగ్‌ లేదా రన్నింగ్‌ లాంటి కదలికల లక్షణాలు కలిగి ఉండాలి. అంటే వాటికి చక్రాలు ఉండరాదన్నమాట. 
»    రోబోల కనీస ఎత్తు 1.6 అడుగుల నుంచి  గరిష్టంగా 6 అడుగుల మధ్య ఉండాలి. 
»  హిప్‌–టు–ఫుట్‌ పొడవు అంటే నడుము నుంచి పాదం వరకు 1.47 అడుగుల ఎత్తు ఉండాలి. 
» రిమోట్‌ ద్వారా నియంత్రించే రోబోలు లేదా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్‌ హ్యూమనాయిడ్‌లను పోటీలోకి దింపాలి. అయితే అవసరమైతే పోటీ మధ్య బ్యాటరీలను మార్చుకోవచ్చు.

2,76,288
ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ ప్రకారం 2023లో చైనా సంస్థలు ఇన్‌స్టాల్‌ చేసిన రోబోల సంఖ్య. ఇది ఆ ఏడాది ప్రపంచంలోని మొత్తం రోబోల్లో 51 శాతం  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)